Namaste NRI

విజయ్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. గోట్ గ్లింప్స్​ రిలీజ్

త‌మిళ అగ్ర క‌థానాయకుడు దళపతి విజయ్  హీరోగా న‌టిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్). మీనాక్షి చౌదరి  హీరోయిన్‌. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కల్పతి ఎస్ అఘోరం నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు వెంకట్ ప్రభు  దర్శకత్వం. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌, వైభవ్, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ పుట్టిన‌రోజు  సంద‌ర్భంగా మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌ ను చూస్తే.. విజయ్ ఇందులో డ్యుయెల్​ రోల్​లో క‌నిపించ‌నున్నాడు. ఇక విజయ్ చేసిన​ యాక్షన్​ సీక్వెన్స్​ గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఒకే బైక్​పై ఇద్దరు విజయ్​లు గన్​లతో స్టంట్​లు చేస్తూ కనిపించారు. రీసెంట్‌గా ఈ సినిమా తేదీని మేక‌ర్స్ అనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ సెప్టెంబ‌ర్ 05న వ‌రల్డ్ వైడ్‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events