Namaste NRI

విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ స్టార్… టీజర్‌ టైం ఫిక్స్!

హీరో విజయ్‌ దేవరకొండ  ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఫ్యామిలీ స్టార్‌.  పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడు.  ఈ చిత్రంలో సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్‌  హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా,  టైటిల్‌ లుక్‌, గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.

విజయ్‌ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యామిలీ స్టార్ టీజర్‌ అప్‌డేట్ రానే వచ్చింది. ఈ మూవీ టీజర్‌ను మార్చి 4 సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్‌ లాంఛ్ చేశారు. టీషర్ట్‌లో లుంగీని పట్టుకుని ఉన్న బ్యాక్‌ లుక్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. లైన్‌లో నిలబడి ఉల్లిపాయలు తేవడం, టైంకు లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ పంపించడమనుకున్నావా, సెటిల్‌ మెంట్ అంటే? అంటే అని అజయ్‌ ఘోష్‌ అంటుంటే భలే మాట్లాడతారన్నా మీరంతా ఏ ఉల్లిపాయలు లైన్‌లో నిలబడి కొంటే వాడు మనిషి కాదా, పిల్లలను రెడీ చేస్తే వాడు మగాడు కాదా, ఐరనే వంచాలా ఏంటీ, కొబ్బరికాయ తేవడం మర్చిపోయా, తలకాయ కొట్టేశా అని విజయ్ దేవరకొండ గ్లింప్స్ వీడియోలో క్లాస్‌ లుక్‌లో చెబుతున్న మాస్‌ డైలాగ్స్‌ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. కాగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమాలు చేసే పరశురాం ఈ సారి ఎలాంటి టీజర్‌ను కట్‌ చేశాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా రు మూవీ లవర్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events