విజయ్ దేవరకొండ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆ మధ్య ఖుషి సక్సెస్ మీట్‌లో తన వంతుగా ఓ వంద కుటుంబాలకు లక్ష చొప్పున ఇస్తానని మాట ఇచ్చాడు. చెప్పినట్లుగానే వంద కుటుంబాలకు లక్ష రూపాయల చెక్‌ను అందజేశాడు. విజయ్ దేవరకొండ సమాజ సేవ అంటే ఎప్పుడు ముందుంటాడు. ముఖ్యంగా ప్రతీ ఏటా తన పుట్టిన రోజున జనాలకు ఏదో విధంగా హెల్ప్ చేస్తుంటాడు. అదే విధంగా ఖుషీ సినిమా సక్సెస్ కావడంతో తన వంతుగా వంద కుటుంబాలకు లక్ష చోప్పున కోటి రూపాయలు పంచడం నిజంగా అభినందనీయం.
ఖుషీ సినిమాకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు విజయ్ దేవరకొండ. నిజానికి ఈ సినిమాకు ముందు నుంచి పాజిటీవ్ హైపే నెలకొంది. దానికి తోడు పాటలు, ట్రైలర్ ఒక దానికి మించి మరొకటి జనాల్లో తిరుగులేని హైప్ నెలకొల్పాయి. సెప్టెంబర్ 1న సోలోగా రిలీజైన ఈ సినిమాకు మరీ అంత పాజిటీవ్ రివ్యూలు ఏమి రాలేవు కానీ, ఒక్కసారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. దాంతో ఫ్యామిలీ ఆడియెన్స్ సహా యూత్ థియేటర్‌ల వైపు పరుగులు తీశారు. తొలిరోజు రూ.30 కోట్ల రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టి విజయ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు. ఇక వరుసగా రెండు, మూడు రోజులు ఊహించని రేంజ్‌లో కలెక్షన్‌లు కొల్లగొట్టింది. ఇలా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్‌ను చూసి ఫ్యాన్స్ గర్వంగా ఫీలవుతున్నారు.