విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్.నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభంకానుంది.ఈ సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఓ వ్యక్తి పోలీస్ దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢచారిని తలపిస్తున్నాడు. పోస్టర్ మీద ఐ డోండ్ నో వేర్ ఐ బిలాంగ్, టూ టెల్ యూ హూమ్ ఐ బిట్రేయిడ్- అనానిమోస్ స్పై అని రాసి ఉంది.
దర్శకుడు మాట్లాడుతూ ఇదొక విభిన్న కథా చిత్రం. విజయ్ దేవరకొండ పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది అని చెప్పారు. అద్భుతమైన కంటెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం. అందరి అంచనాల్ని అందుకునే విధంగా ఉంటుంది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తాం అని నిర్మాత నాగవంశీ తెలిపారు.