శ్రీచరణ్, గీత్‌సైని జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కన్యాకుమారి. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో దామోదర నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీకాకుళం అమ్మాయి కన్యాకుమారి పాత్రలో కథానాయిక గీత్‌సైని కనిపించనుంది. డిగ్రీ చదివిన కన్యాకుమారి ఓ చీరల దుకాణంలో పనిచేస్తుంటుంది. అందంతో పాటు పొగరూ ఎక్కువే. అలాంటి అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరిగిందన్నదే సినిమా కథాంశమదని, వినోదప్రధాన ప్రేమకథగా మెప్పిస్తుంద ని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శివ గాజుల, హరిచరణ్ కె, సంగీతం: రవి నిడమర్తి, నిర్మాణ సంస్థ: రాడికల్ పిక్చర్స్, రచన-నిర్మాణం-దర్శకత్వం: దామోదర.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)