విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి ఖుషి టైటిల్‌ను ఖరారు చేశారు. ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నది. ప్రస్తుతం కశ్మీర్‌లో రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నదీ సినిమా. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో విజయ దేవరకొండ, సమంత నవ వధూవరులుగా కొంగుముడితో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్నారు. నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. జయరాం, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, లక్ష్మీ తదితరులు ఇతర పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ: జి.మురళి, సంగీతం: హిషామ్ అబ్దుల్ వాహబ్, సీయివో: చెర్రీ. ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రకటించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)