విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం లాభం. లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ దేవీ ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్.పి.జననాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సినిమాను నా సొంత బ్యానర్‌లో నిర్మించాను. రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర సమస్య, వ్యవసాయ భూముల పైనా పంటల పైనా కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైనా చాలా కూలకషంగా ఇందులో చూపించడం జరిగిందన్నారు.
ట్రైలర్ లో కూడా అదే చూపించాము. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలకు నా అభినందలు అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తుండటం హ్యాపీగా ఉందని నిర్మాతలు అన్నారు. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది అన్నారు. ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పించే చిత్రమిది అని అన్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషలో విడుదల అవుతుంది.