
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఎ సి ఇ. రుక్మిణి వసంత్ కథానాయిక. అరుముగకుమార్ స్వీయ దర్శకత్వం. మే 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అధికారిక ప్రకటనతోపాటు పోస్టర్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఉత్కంఠకు గురిచేసే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందిందని, విజయ్‌సేతుపతి కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో యోగిబాబు, బి.ఎస్.అవినాష్, దివ్య పిైళ్లె, బబ్లూ, రాజ్‌కుమార్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: కరణ్ బహదూర్.
