విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న లైగర్ చిత్రం ఆరంభం నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. తాజాగా ఈ చిత్రం అమెరికా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో ప్రముఖ బాక్సర్ మైక్‌టైష్, విజయ్ దేవరకొండ, అనన్యపాండేలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఒక చిన్ని షెడ్యూల్ మాత్రమే పెండిరగ్‌లో ఉంది. ఈ షెడ్యూల్‌ని భారత దేశంలో తెరకెక్కిస్తారు. ఈ రోజు అభిమాలను డబుల్ సరైప్రైజ్ ఇచ్చారు నిర్మాతలు. ఈ సినిమా 2022 ఆగస్టు 25న ప్రేక్షకులకు ముందుకు రానన్నట్లు ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ కొత్త సంవత్సరం మంట పుట్టిందాం అంటూ నిర్మాతలు జోష్ పెంచారు. ఫస్ట్ గ్లింప్స్‌ను ఈ నెల 31న విడుదల చేయనున్నారు.
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పూరీ కనెక్ట్స్‌తో కలిసి బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. రమ్యకృష్ణ, రోహిత్‌రాయ్, విష్ణురెడ్డి, అలీ, మకరంద్‌దేశ్ పాండే, గెటప్‌శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విష్ణు శర్మ, నిర్మాతలు : పూరి జగన్నాథ్, చార్మి, కరణ్‌జోహార్, అపూర్వమోహతా, దర్శకత్వం: పూరి జగన్నాథ్.