అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి. మహేశ్ బాబు. పి దర్శకత్వం. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి మరోమారు నిరూపించింది. జవాన్ సినిమాను తట్టుకొని స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో ఈ సినిమా దూసుకెళ్తున్నది అన్నారు. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి ఆద్యంతం నవ్వించగా, అనుష్క భావోద్వేగభరితమైన పాత్రలో ఆకట్టుకుంది. అమెరికాలో వన్ మిలియన్ కలెక్షన్స్ మార్క్‌ను దాటింది. ఈ సినిమా కాన్సెప్ట్ అక్కడివాళ్లకు బాగా నచ్చింది. ప్రతీ ఒక్కరూ ఫీల్‌గుడ్ మూవీ చూశామనే అనుభూతికి లోనవుతున్నారు. ఇలాంటి గొప్ప చిత్రాలను మనమంతా ప్రోత్సహించాలి అన్నారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో పాజిటివ్‌టాక్‌తో నడుస్తున్నదని చిత్ర దర్శకుడు మహేష్‌బాబు ఆనందం వ్యక్తం చేశారు. యూవీ క్రియేషన్స్ ప్రమోద్ మాట్లాడుతూ దిల్‌రాజుగారు తొలి నుంచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మాకు మార్గదర్శిలా నిలుస్తున్నారు. ఈ సినిమాకు అంతటా అద్భుతమైన స్పందన లభిస్తున్నది అని చెప్పారు. నవీన్ పొటిశెట్టి అమెరికా నుంచి రాగానే విజయోత్సవాలు నిర్వహించడంతో పాటు, విజయయాత్రని చేపడతాం అని అన్నారు.