చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం హనీమూన్ ఎక్స్‌ప్రెస్. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రల్ని పోషించారు. బాల రాజశేఖరుని దర్శకుడు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించారు. ఈ సినిమాలోని రెండో గీతం ప్రేమ ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు. కల్యాణి మాలిక్ స్వరపరచిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఇదే వేడుకలో సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆద్యంతం వినోదాన్ని పంచే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శిష్ణా వి ఎమ్‌కె, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఆర్.పి.పట్నాయక్, నిర్మాతలు: కెకెఆర్, బాలరాజ్, రచన-దర్శకత్వం: బాల రాజశేఖరుని.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)