కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా నటిస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ్ణ. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మురళి కిషోర్ దర్శకుడు ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా ఇది. గీతా ఆర్ట్స్ సంస్థలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఇదొక స్పెషల్ మూవీ. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచే సినిమా అవుతుంది అన్నారు. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ విష్ణు తత్వాన్ని కమర్షియల్ కథలో చెప్పే చిత్రమిది. నిత్యం సంతోషంగా ఉండాలని, సాటివాడికి సాయం చేయాలనే మంచి సందేశం ఉంది. ఇటీవల విడుదల చేసిన పాటకు మంచి స్పందన వస్తున్నది. మా సంస్థలో ప్రతిభ గల కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం సంతృప్తిగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్, గీత రచయిత కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల 17న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కశ్మీర పర్దేశీ, దర్శకుడు మురళి కిషోర్, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరత్వాజ్, కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు.