వినాయక చవితి వేడుకలు లండన్ సమీపంలో ఉన్న రీడిరగ్ నగరంలో వైభవంగా నిర్వహించారు. గణేశ్ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి గణపతులను నిమజ్జనం చేశారు. భారీ ఎత్తున రీడిరగ్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. వివిధ రాష్ట్రాలకు ప్రవాసులతో పాటు బ్రిటిష్ వాసులు పాల్గొని, ఆటపాటలతో సంబరాలు చేశారు. థేమ్స్ నదిలో గణపయ్యలను నిమజ్జనం చేశారు.