Namaste NRI

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస..సీఎం, మంత్రుల ఇళ్లపై

బీజేపీ పాలిత మణిపూర్‌ మరోసారి భగ్గుమంది. గత ఏడాదిన్నరకు పైగా జాతుల వైరంతో రగులుతున్న రాష్ట్రం లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మైతీలకు చెందిన 10 మంది మహిళ లు, చిన్నారులను కుకీ వర్గీయులు అపహరించుకుపోయారు. అయితే వారిలో ఆరుగురు మహిళలు, చిన్నారు ల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు పెల్లుబికాయి. ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. రోడ్లపై టైర్లను కాలుస్తూ రాకపోకలకు అంతరాయం కలిగిం చారు. పలు చోట్ల దుకాణాలు, మార్కెట్లను మూసివేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకారులు ఇంఫాల్‌లో ఉన్న ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల గృహాలను ముట్టడించి ఆస్తులను ధ్వంసం చేశారు.

ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే సపమ్‌ నిశికాంత సింగ్‌ ఆ సమయం లో గృహంలో లేకపోవడంతో ఆయనకు చెందిన స్థానిన దినపత్రిక కార్యాల యాన్ని ధ్వంసం చేశారు. దీంతో శనివారం సాయంత్రం 4.30 గంటల నుంచి ఇంఫాల్‌ పశ్చిమ, తూర్పు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంఫాల్‌ వెస్ట్‌, ఈస్ట్‌, బిష్ణుపూర్‌, తౌబల్‌, కక్‌ చింగ్‌, కంగ్‌పోక్పీ, చురాచాంద్‌పూర్‌ జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను రెండు రోజుల పాటు నిలిపివేశారు. తొలుత జిరి నది వద్ద శుక్రవారం సాయంత్రం మూడు మృతదేహాలు, బారక్‌ నదీ ప్రాంతంలో శనివారం మరో మూడు మృతదేహాలు కన్పించాయి. ఆ ఆరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events