Namaste NRI

విరూపాక్ష మరో ఘనత

ప్రస్తుతం టాలీవుడ్‌ ప్రేక్షకులు విరూపాక్ష మంత్రం జపిస్తున్నారు. సినిమా వచ్చి వారం అవుతున్నా ఇంకా థియేటర్‌లు నిండుగా కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్‌ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. టిక్కెట్‌లు భారీ సంఖ్యలో తెగుతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్‌లకు పరుగులు తీస్తున్నారు. చాలా కాలం తర్వాత ఒక మంచి థ్రిల్లర్‌ సినిమా చూశామంటూ సమీక్షలు తెలుపుతున్నారు. ఇక తొమ్మిదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్న రాని గుర్తింపు,  సాయితేజ్‌కు ఈ ఒక్క సినిమా తెచ్చిపెట్టింది. ఇప్పటికే రూ.60 కోట్ల కలెక్షన్‌లు సాధించిన ఈ సినిమా ఫైనల్‌ రన్‌లో మరో పది, పదిహేను కోట్లు వెనకేసుకోవడం ఖాయం అనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించింది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్‌లో మిలియన్‌ డాలర్ మార్క్‌ను దాటేసింది. ఇక సాయిధరమ్‌ తేజ్‌కు ఇది తొలి మిలియన్‌ డాలర్‌ మూవీ కావడం విశేషం. ఇక ఇదే జోరు కొనసాగితే విరూపాక్ష రెండు మిలియన్ల మార్క్‌కు చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events