ప్రపంచాన్ని కల్లోలపరిచిన కరోనా మహహ్మారి చైనాలోని వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ల్యాబ్ నుంచే లీక్ అయినట్టు అమెరికాకు చెందిన రిపబ్లికన్ పార్టీ నేతలు ఓ నివేదికలో ఆరోపించారు. మనుషులకు సోకేలా ఆ వైరస్‌లో కొన్ని మార్పులు చేశారని తెలిపారు. ఆ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా దాచారని పేర్కొన్నారు. చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది జరిగిందన్నారు. అమెరికాకు చెందిన కొందరు నిపుణులు కూడా దీనికి సాయపడ్డట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించి సాక్ష్యాలు ఉన్నట్టు ఆ పార్టీ నేత మైక్ మెక్‌కౌల్ ఓ నివేదికను విడుదల చేశారు. 2019 సెప్టెంబర్ 12కి ముందే వైరస్ లీక్ అయినట్టు పేర్కొన్నారు. ఈ ఆరోపణలను అమెరికా నిఘా సంస్థలు ఇంకా ధ్రువపర్చాల్సి ఉన్నది.