వీసాను పొందేందుకు, లేదా రద్దయిన వీసాను కొనసాగించాలని కోరేందుకు విదేశీయులకు ఎలాంటి ప్రాథమిక హక్కు ఉండదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రభుత్వాలకు వీసాల మంజూరు విషయంలో సర్వసత్తాక అధికారులు ఉంటాయని సర్కారు స్పష్టం చేసింది. వీసా మంజూరు చేయకుండా ఎవరినైనా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం, వారిపై ఆంక్షలను ఎత్తివేయడం వంటి అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయని పేర్కొంది. ఆయా కేసుల వారీగా అధికారులు వాటిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. తబ్లీగీ జమాత్ కార్యకలాపాల్లో భాగస్వాములైనందుకు గాను 35 దేశాలకు చెందిన 2,765 మందికి పదేళ్ల పాటు భారత వీసా పొందకుండా కేంద్రం గతంలో ఆంక్షలు విధించింది. దాన్ని సవాల్ చేస్తూ పొందకుండా కేంద్రం గతంలో ఆంక్షలు విధించింది. దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎ.ఎం.ఖాన్‌విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ వీసా మంజూరే చేయాలన్న నిబంధనేమీ ఉండదని గుర్తు చేసింది.














