Namaste NRI

వీసా-ఆన్‌-అరైవల్‌.. భారతీయులకు యూఏఈ ఆఫర్‌ 

భారతీయ పౌరులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ) వీసా ఆన్ అరైవల్ వసతిని కల్పించింది. మామూలు పాస్ పోర్టు ఉన్న భారతీయులు కూడా ఇక అరబ్ ఎమిరేట్స్ కు వెళ్ళవచ్చు. అయితే కొన్ని షరతులు తప్పవు. యుఏఈ లో దిగినప్పటి నుంచి వారి పాస్ పోర్టు కనీసం ఆరు నెలలకు చెల్లుబాటు కలిగి ఉండాలి. అంటే వ్యాలిడ్ పాస్ పోర్టు ఉండాలి. దరఖాస్తుదారుడికి అమెరికా, ఇంగ్లాండ్, లేక ఏ యూరొప్ దేశం గ్రీన్ కార్డు, పర్మనెంట్ రెసిడెంట్ కార్డు, వ్యాలీడ్ వీసా కలిగి ఉండాలి.

వీసా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి 14 రోజుల వీసా, దీనిక ఫీజు రూ. 2700 నుంచి రూ. 3400 వరకు ఉంటుంది. ఇక రెండో వీసా 64 రోజులది(దీనిని పొడగించడానికి వీలుండదు).  దీనికి రూ. 24500 నుంచి రూ. 27000 వరకు ఖర్చవుతుంది. ఈ ఫీజును దిగగానే చెల్లించాల్సి ఉంటుంది.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భారత్ తో సంబంధాలను పెంచుకుంటోంది. 2023 నుంచి భారతీయ యాత్రికులు 25 శాతం పెరిగారు.  ఇప్పుడు వీసా ఆన్ అరైవల్ తో రెండు దేశాల మధ్య రాకపోకలు మరింత పెరగొచ్చని భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events