భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు తగ్గిపోతున్నాయి. నిరుడు ఫిబ్రవరిలో జారీ అయిన అమెరికన్ వీసాలతో పోల్చుకుంటే, ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 శాతం తగ్గుదల కనిపించింది. అన్ని దేశాల విద్యార్థులకు అమెరికా జారీ చేసిన వీసాల సంఖ్య మొత్తం మీద 4.75 శాతం తగ్గింది.

అమెరికాలోని సుమారు 170 కళాశాలల్లో చదువుతున్న 1,100 మందికిపైగా విద్యార్థుల వీసాలు రద్దయిన సంగతి తెలిసిందే. బాధిత విద్యార్థుల్లో చాలా మంది న్యాయపోరాటం చేస్తున్నారు. న్యాయ పోరాటం చేయాలని బాధిత విద్యార్థులకు భారత ప్రభుత్వం సలహా ఇచ్చింది. భారతీయ విద్యార్థులు (ఎక్సేంజ్ విజిటర్స్‌తో సహా) ఢిల్లీలో అమెరికన్ వీసా కోసం సగటున 58 రోజులపాటు వేచి చూడవలసి వస్తున్నది.
