విశాల్ హీరోగా నటిస్తున్న చిత్రం మార్క్ ఆంటోనీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్. వినోద్‌కుమార్ నిర్మిస్తున్నారు. రీతూ వర్మ, ఎస్.జె.సూర్య, సునీల్ వర్మ, అభినయ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విశాల్ 33వ సినిమా ఇది. సోమవారం (ఆగస్టు 29) విశాల్ పుట్టినరోజు సందర్భంగా మార్క్ ఆంటోని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. విశాల్ శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. ఆయన గెటప్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కథలో మార్క్ ఆంటోనీ ఎవరు? ఆ కథేమిటన్నది తెరపైనే చూడాలి. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్రబృందం పేర్కొంది. వైజీ మహేంద్రన్, నిళగల్ రవి, కింగ్సే తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం: అభినందన్ రామానుజం, కళ: ఆర్. విజయ్ మురుగన్.
