Namaste NRI

సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన ఆరోపణలు

ముంబయి సెన్సార్‌ అధికారులపై  తమిళ హీరో విశాల్‌  సంచలన ఆరోపణలు చేశారు. తన చిత్రం మార్క్‌ ఆంటోని హిందీ సెన్సార్‌ పనుల కోసం సంబంధిత అధికారులకు 6.5లక్షలు  లంచంగా ఇచ్చానని తెలిపారు. ముంబయి సెన్సార్‌ ఆఫీస్‌లో అవినీతి పెచ్చు మీరిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. మరో మార్గం లేక డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా అవినీతికూపంలోకి వెళ్లకూడదు. నాలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఏ నిర్మాతకూ రావొద్దని కోరుకుంటున్నా. చివరకు న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నా. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేల దృష్టికి తీసుకెళ్తాను అని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events