కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ. కశ్మీరా కథానాయికగా నటిస్తుంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. తిరుపతిలో ఈ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. నాల్గవ సింగిల్ సోల్ ఆఫ్ తిరుపతి అనే పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో పన్నెండు తరాలకు చెందిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారసులను సన్మానించారు. కథానుగుణంగా ఈ చిత్రాన్ని ఎక్కువ భాగం తిరుపతిలోనే చిత్రీకరించాం. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. చక్కటి కుటుంబ కథా చిత్రమిది. ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా అందరిని మెప్పిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల మన్ననలు పొంది U/A సర్టిఫికెట్ ను సాధించుకుంది. అయితే ముందుగా సినిమాని ఈ నెల 17న విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా ఒక్క రోజు ఆలస్యంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని ఈ నెల 18న విడుదల చేస్తున్నట్టు యూనిట్ తాజాగా ప్రకటించింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: డేనియల్ విశ్వాస్, సంగీతం: చైతన్ భరద్వాజ్, దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు.














