అమెరికాలోని బోస్టన్ విమానాశ్రయంలో కొల్లా విశ్వచంద్ దుర్మరణం పాలయ్యాడు. యూఎస్‌లోని బోస్టన్ ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉండగా బస్సు వచ్చి ఢీకొట్టడంతో ఆయన మరణించాడు. 47 ఏళ్ల భారతీయ-అమెరికన్ విశ్వచంద్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. కొల్లా తాకేడ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగి అయిన ఆయన మార్చి 28న బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విజిటింగ్ సంగీతకారుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. టెర్మినల్ బి దిగువ స్థాయిలో ఉండగా అతన్ని ఒక బస్సు ఢీకొట్టిందని మసాచుసెట్స్ స్టేట్ పోలీసులు తెలిపారు. డ్యూటీలో లేని నర్సు కొల్లాకు సహాయం చేయడానికి పరుగెత్తారు. అయితే అతను సంఘటనా స్థలంలోనే మరణించారు.