Skip to main content

Namaste NRI

కల్ట్ రిలీజ్ డేట్ లాక్ చేసిన విశ్వక్ సేన్

విశ్వక్‌సేన్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కల్ట్‌. సందీప్‌ కాకర్ల నిర్మాత. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో స్లాషర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా కొత్త గ్లింప్స్‌ను విడుదల చేశారు.

ఇందులో హీరో విశ్వక్‌సేన్‌ ఇంటెన్స్‌ లుక్స్‌తో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించారు. ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని మేకర్స్‌ తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, జపనీస్‌, స్పానిష్‌ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రానికి తరుణ్‌ భాస్కర్‌ సంభాషణలు అందిస్తుండగా, రవిబస్రూర్‌ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 30న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events