Namaste NRI

రోటి కపడా రొమాన్స్‌ సినిమా సాంగ్‌ను రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్‌, సువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బు చౌదరి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఎమోషనల్‌ లవ్‌ జర్నీ రోటీ కపడా రొమాన్స్‌. విక్రమ్‌ రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణు గోపాల్‌, సృజన్‌ కుమార్‌ బొజ్జం నిర్మాతలు. ఈ సినిమాలోని గలీజ్‌ అని సాగేపాటను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి క్రేజీ హీరో విశ్వక్‌సేన్‌ అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాంకాంక్షలు అందించారు.

కొత్త పాయింట్‌తో సాగే యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, ఇటీవల కొందరు యూత్‌కి షో వేస్తే వారందరికీ బాగా నచ్చిందని, సాంకేతికంగా సినిమా నెక్ట్స్‌ లెవల్లో ఉంటుందని, దర్శకుడు విక్రమ్‌రెడ్డి ప్రతిభావంతుడని, పెద్ద దర్శకుడిగా ఎదుగుతాడని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. ఇదొక భావోద్వేగాలతో కూడి ప్రేమ ప్రయాణమ ని, తప్పకుండా విజయం సాధిస్తుందని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రబృందం మొత్తం మాట్లాడారు. ఆగస్ట్‌ 2న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోశ్‌రెడ్డి, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, ఆర్‌.ఆర్‌. ధృవన్‌, వసంత్‌.జి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events