
హీరో విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతున్న చిత్రం ఫంకీ. కయాదు లోహర్ కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో విశ్వక్సేన్ సినీ దర్శకుడి పాత్రలో కనిపించారు. సినిమా కథ నేపథ్యంలో టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. పంచ్ డైలాగ్‌లు నవ్వుల్ని పంచాయి. దర్శకుడు అనుదీప్ తనశైలి వినోదంతో సినిమాను తీర్చిదిద్దాడని టీజర్‌ను చూస్తే అర్థమవుతున్నది. విశ్వక్సేన్, కయాదు లోహర్ జోడీ బాగా కుదిరింది. రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తే సంపూర్ణ వినోదభరిత చిత్రమిదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, రచన-దర్శకత్వం: అనుదీప్ కేవీ.
















