Namaste NRI

విశ్వక్‌ సేన్‌ కొత్త చిత్రానికి శ్రీకారం

యువహీరో విశ్వక్‌ సేన్‌ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో నాయికగా మీనాక్షి చౌదరి నటిస్తున్నది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ తాళ్లూరి నిర్మాత.  ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ  నిర్మిస్తున్నది. హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నిర్మాత రామ్‌ తాళ్లూరి సతీమణి రజినీ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ గతేడాది దర్శకుడు రవితేజ నాకు ఈ కథ చెప్పాడు. విశ్వక్‌ అయితే ఈ స్క్రిప్ట్‌కు బాగుంటుందని అనుకున్నాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే సినిమా అవుతుంది. ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం  అన్నారు. విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ నేను హీరోగా నటిస్తున్న పదో సినిమా ఇది.యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో భిన్నంగా ఉంటుంది. కొత్త దర్శకుడు రవితేజ ప్రతిభావంతుడు. అతనితో సినిమా చేయడం సంతోషంగా ఉంది అన్నారు.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మనోజ్‌ కటసాని, సంగీతం : జేక్స్‌ బిజోయ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events