విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం లైలా. ఆకాంక్ష శర్మ హీరోయిన్. రామ్నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించారు. ఇందులో విశ్వక్సేన్ లేడీ గెటప్లో కనిపించనున్నారని తెలిసిందే. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో హీరో విష్వక్ సేన్ మాట్లాడుతూ ఇందులో నేను లేడీ గెట్పలో కనిపించేది మిమ్మల్ని నవ్వించడానికే. ఇందులోని లైలా గెటప్లో సిద్ధమవ్వడానికి ప్రతీ రోజూ రెండు గంటలు పట్టేది. ఇదొక విభిన్న తరహా చిత్రం. త్వరలోనే అటక్ పటక్ సాంగ్ విడుదలవుతుంది. నేనే ఆ పాటను రాశాను అని అన్నారు. పూర్తి వినోదాత్మక చిత్రమిది. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. విశ్వక్ పోషించిన రెండు పాత్రలు ఆకట్టుకుంటాయి అని దర్శకుడు రామ్నారాయణ్ చెప్పారు. ఈ నెల 14న ప్రేమికుల రోజున సినిమా విడుదలవుతోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)