Skip to main content

Namaste NRI

విశ్వక్‌సేన్‌ గామి ఫస్ట్‌లుక్‌

విశ్వక్‌సేన్‌ హీరోగా విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్‌ డ్రామా గామి. చాందిని చౌదరి కథానాయిక. కార్తీక్‌ కుల్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై శబరీష్‌ నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అఘోరా గెటప్‌లో విశ్వక్‌సేన్‌ లుక్‌ ఆశ్చర్యపరి చేలా ఉంది. చుట్టూ చాలా మంది అఘోరా లు ఆయన్ను తాకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్‌ భయకరంగా కనిపిస్తున్నది. విశ్వక్‌ సేన్‌ ఈ చిత్రంలో శంకర్‌ అనే అఘోరాగా కనిపించ నున్నారు. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్‌రెడ్డి, సంగీతం: నరేశ్‌ కుమారన్‌, నిర్మాత: కార్తీక్‌ శబరీష్‌, దర్శకత్వం: విద్యాధర్‌ కాగిత.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events