Skip to main content

Namaste NRI

విశ్వంభర.. దుమ్ములేపుతున్న సాంగ్ రామ రామ సాంగ్

మెగాస్టార్‌ చిరంజీవి విశ్వంభర నుంచి ఇటీవలే రామ రామ  అంటూ భక్తి భావాలతో కూడిన ఓ గీతాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తున్నది. ఇప్పటికే రెండున్నర కోట్లకుపైగా వ్యూస్‌ సాధించిన రికార్డు సృష్టించింది. అదే విధంగా అన్ని మ్యూజిక్‌ ఛార్ట్స్‌లో అగ్ర భాగాన కొనసాగుతున్నది. కోదండరాముడి గుణగణాలను కీర్తిస్తూ సాగిన ఈ పాట ప్రేక్షకులందరినీ అలరిస్తున్నది.

చిరంజీవి నృత్యరీతులు, కీరవాణి బాణీ, రామజోగయ్య శాస్త్రి చక్కటి సాహిత్యం ఈ పాటలో ప్రధానాకర్షణలుగా నిలుస్తున్నాయని మేకర్స్‌ ఆనందం వ్యక్తం చేశారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది. దసరా కానుకగా సెప్టెంబర్‌ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News