ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ నెల 14వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. రాష్ట్రానికి జీవధారైన పోలవరం ప్రాజెక్టు పనులను నిర్ధారించిన సమయంలో పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ దృఢసంకల్పంతో ఉన్నారు. ఇందులో భాగంగానే పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. ఈ మేరకు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.