విశ్వక్‌సేన్ స్వీయ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ 11వ సినిమా కూడా ప్రకటించాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ అప్‌డేట్ ఇచ్చేశాడు విశ్వక్‌సేన్. విఎస్ 11 ఇవాళ పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టారు. ప్రొడక్షన్ నంబర్ 12గా వస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే రెండో వారంలో షురూ కానుంది. ఈ మూవీలో రాజోలు సుందరి అంజలి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ పొట్టి హెయిర్‌తో, కోరమీసంతో కనిపించబోతున్నట్టు తాజా ఫొటోలతో అర్థమవుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తోండగా, దీనిపై అధికారిక అప్‌డేట్ రావాల్సి ఉంది.

















