– TTA లో ఆరోగ్యానికి పెద్ద పీట
– యువతకు దిక్సూచి TTA
తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది.
తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్.TTA founder Pailla Malla Reddy Garu, Advisory Consul chair – Vijayapal reddy గారు,Co-chair – Mohan Patlolla గారు, Member: Bharat Madadi గార్ల ఆధ్వర్యంలో 2015 లో మొదలై , ప్రస్తుత ప్రసిడెంట్ వంశిరెడ్డి కంచరకుంట్ల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవాకార్యక్రమాలతో దూసుకుపోతున్న తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సేవ డేస్ కార్యక్రమాన్ని ఈసంవత్సరం కూడా నిర్వహించ తలపెట్టింది . ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది గారు ,సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు ప్రజలను కోరారు.
TTA 5K రన్ కార్యక్రమం లో MLA సుదీర్ రెడ్డి ముఖ్య అతిథి గా పాల్గొన్నారు..ఆయన మాట్లాడుతూ TTA సేవాభావం కలిగిన సంస్థ అని మాతృభూమి కి సేవచేయలనే ఆలోచన తో కదిలిన TTA సుదీర్ఘకాలం కొనసాగాలని కోరారు. TTA ప్రసిడెంట్ వంశీ రెడ్డి 5కే రన్ కార్యక్రమం లో మాట్లాడుతూ TTA సమాజ సేవా కోసం ఏర్పడింది అన్నారు. YOYO టీవీ అధినేత మల్లారెడ్డి TTA సుదీర్ఘకాలం కొనసాగాలని కోరుకున్నారు. TTA నాయకులు విజయపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ కోవిడ్ లో TTA సేవలు మరువలేనివి అని అన్నారు. TTA అడ్వైసర్ మోహన్ రెడ్డి పటోళ్ల మాట్లాడుతూ సేవా డేస్ మరియు అమెరికాలో ఇప్పటికే TTA సాధించిన విజయాలు వివరించారు. TTA సేవా డేస్ కో ఆర్డినేటర్ సురేష్ గారు మాట్లాడుతూ ఆరోగ్యం మహాభాగ్యం అని TTA ఆరోగ్యానికి కట్టుబడి ఉందని తెలిపారు.సంపంగి అధినేత మాట్లాడుతూ అరోగ్యం పై పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు.
TTA ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మలిపెద్ది మాట్లాడుతూ ఇప్పుడు రెండు సంత్సరాల కు ఒకసారి చేసే చేస్తున్న కార్యక్రమం TTA సేవా డేస్ ఇకనుంచి ప్రతి సంవత్సరం చేస్తామని ప్రకటించారు. డా. ద్వారక నాద్ TTA సేవా డేస్ కోఆర్డినేషన్ బ్యాక్ ఎండ్ వర్క్ చేసినందుకు …TTA ధన్యవాదాలు తెలిపింది. Kavitha Reddy General SecretaryTTA గారు మాట్లాడుతూ 5K రన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అన్నారు. TTA మహిళా నాయకురా లు Jyothi Reddy TTA సేవా డేస్ Health and wellness advisor గారు .ఇకపై సమాజసేవ లో TTA మరింత ఉత్సాహం తో పనిచేస్తుందని తెలిపారు….పల్లవి కాలేజెస్ విద్యార్థులను కార్యక్రమానికి ఆహ్వానించారు. సుదీర్ రెడ్డి MLA గారిని TTA నాయకత్వం శాలువాతో సన్మానించి మెమంటో తో సత్కరించారు.
కార్యక్రమంలో జుంబా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది..TTA ప్రసిడెంట్ వంశి రెడ్డి కంచరకుంట్ల వచ్చిన ఆహుతులను ఉత్సహపరుస్తు జంబా డాన్స్ ను ఆస్వాదించారు..LB నగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి కూడా యూత్ ను ఉత్సహపరుస్థు జుంబ డ్యాన్స్ లో పాల్గొన్నారు…5K రన్ కార్యక్రమాన్ని TTA నాయకత్వం మరియు MLA సుదీర్ రెడ్డి ఉత్సాహంగా ప్రారంబించారు..ఉత్సాహంగా కొనసాగిన 5k కార్యక్రమం తిరిగి తన గమ్యస్థానానికి చేరుకుంది. పల్లవి కాలేజ్ విద్యార్థుల నృత్య ప్రదర్శన మణిపూర్ కళాకారుడు చేసిన మణిపూర్ సంప్రదాయ ప్రదర్శన (కర్ర ప్రదర్శన ) అద్భుతంగా కొనసాగింది. కార్యక్రమం ఆద్యంతం ఉత్సహబరితంగా కొనసాగింది. TTA నాయకత్వం కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.