చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. మరో ముఖ్య పాత్రలో హీరో రవితేజ కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. వింటేజ్ చిరంజీవి గుర్తు చేసేలా పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో పూర్తి కమర్షియల్ మూవీగా ఈ సినిమా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. జనవరి 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. విడుదల తేదీతో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ప్రచార చిత్రంలో చిరు ఊర మాస్ లుక్‌తో ఆకుట్టుకునేలా కనిపించారు. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: ఆర్థర్ ఎ. విల్సన్.