అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అండర్‌వాటర్ డ్రోన్ ను ఉత్తర కొరియా పరీక్షించింది. సముద్రంలో సుమారు 80 నుంచి 150 మీటర్ల లోతులో ఆ డ్రోన్ దాదాపు 59 గంటలు క్రూయిజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తన వద్ద ఉన్న నాన్-న్యూక్లియర్ పేలోడ్‌ను అది పేల్చివేసింది. అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు ఉత్తర కొరియా ఈ పరీక్షలతో పరోక్ష హెచ్చరికలు చేస్తున్నట్లు నిపుణులు తెలిపారు. కొత్త డ్రోన్ సిస్టమ్‌ను హెయిలీ లేదా సునామీగా పిలుస్తున్నారు. శత్రువుల జలాల్లోకి ఈ డ్రోన్లు చొచ్చుకెళ్లి అటాక్ చేయగలవు. అణ్వాయుధాలతో రేడియో ధార్మికత సృష్టించి, నేవీ పోర్టులను ధ్వంసం చేసే సత్తా ఈ డ్రోన్లకు ఉన్నది. ఏ తీరం నుంచైనా న్యూక్లియర్ అండర్‌వాటర్ డ్రోన్‌ను ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని ఉత్తర కొరియా పేర్కొన్నది.