వలసదారులకు కువైత్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చేసింది. ప్రవాసులు ఆరు నెలలకు మించి దేశం బయట ఉండొద్దని, గడువు కంటే ముందే వచ్చేయాలని సూచించింది. ఒకవేళ ఆరు నెలల కాలపరిమితికి మించి దేశం బయట ఉంటే వారి రెసిడెన్సీ ఆటోమెటిక్గా క్యాన్సిల్ అవుతుందని వెల్లడించింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ తౌహీద్ అల్-కందారి వెల్లడించారు.