గ్రీన్ కార్డ్ హోల్డర్లు, నాన్ సిటిజన్స్ ఎల్లవేళలా తమ వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) హెచ్చరించింది. ఫెడరల్ చట్టాలను అమలు చేసే అధికారులు అడిగినపుడు ఈ పత్రాలను సమర్పించాలని చెప్పింది. వీటిని చూపడంలో విఫలమైన వారికి జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది.

అమెరికా కోడ్, టైటిల్ 8, సెక్షన్ 1304(ఈ) ప్రకారం, వయసు 18 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ గల ప్రతి నాన్ సిటిజన్ తప్పనిసరిగా తమ అలీన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను లేదా అలీన్ రిజిస్ట్రేషన్ రసీదు కార్డును అన్ని వేళలా అందుబాటులో ఉంచుకోవాలి. నాన్ సిటిజన్లు అమెరికా చట్టాలను అనుసరించాలని సీబీపీ తెలిపింది.















