Namaste NRI

చోర్‌ బజార్‌ చిత్రం నుంచి నూనుగు మీసాల పోరడు చూడు

ఆకాష్‌ పూరి హీరోగా నటిస్తున్న సినిమా చోర్‌ బజార్‌. గెహనా సిప్పీ నాయికగా నటిస్తున్నది. తాజాగా ఈ చిత్రం నుంచి నూనుగు మీసాల పోరడు చూడు అనే లిరికల్‌ పాటను హీరోయిన్‌ సమంత విడుదల చేశారు. సురేష్‌ బొబ్బిలి స్వరాలు సమకూర్చగా, కాసర్ల శ్యామ్‌ సాహిత్యాన్ని అందించారు. లక్ష్మీ మేఘన పాడారు. హీరోయిన్‌ సోలో సాంగ్‌గా దీన్ని రూపొందించారు. ఈ పాటలో నాయిక హీరోపై తన ప్రేమను వ్యక్తీకరిస్తుంటుంది. ఐవీ ప్రొడక్షన్స్‌ పతాకంపై వీఎస్‌ రాజు నిర్మాణంలో దర్శకుడు జీవన్‌ రెడ్డి రూపొందించారు. లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events