అగ్ర హీరో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం శంకర్‌దాదా ఎంబీబీఎస్. ఈ చిత్రం 2004లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం రీ రిలీజ్ అవుతోంది. మెగా ప్రొడక్షన్స్ ద్వారా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగబాబు, శ్రీకాంత్ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ అన్నయ్యతో కలసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ఇప్పటికీ నన్ను ఏటీఎం అనే పిలుస్తున్నారు. రీ రిలీజ్‌లోనూ శంకర్‌దాదా ఎంబీబీఎస్ ను పెద్ద హిట్ చేయాలి అని ప్రేక్షకులను కోరారు. నాగబాబు మాట్లాడుతూ ఇలాంటి సినిమాలను థియేటర్లలోనే చూడాలి. ట్రైలర్ చూశాక నాకు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఈ చిత్రం మళ్లీ ప్రేక్షకులను 20 ఏళ్లు వెనక్కి తీసుకెళుతుంది అన్నారు.
ధర్మేంద్ర మాట్లాడుతూ నాగబాబు మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. శ్రీకాంత్ గారు ఎప్పుడూ మాకు ఏటీఎం లాంటి వారే. నవంబర్ 4న సినిమాను చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రాన్ని తాను పశ్చిమ గోదావరి ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేశానని, ఆ టైంలో మంచి లాభాలను తెచ్చిపెట్టిందని సురేష్ కొండేటి పేర్కొన్నారు.