Namaste NRI

తానా  ఆధ్వర్యంలో వాటర్‌ ప్లాంట్‌  ప్రారంభం 

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)  ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని  అనంతపురం జిల్లాలో పలు సేవా కార్యక్రమాలకు అంకురార్పణ చేసింది.  విద్యార్థులకు చేయూత అందించేందుకు సంకల్పించింది. స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయడం ద్వారా వారికి బాసట గా నిలిచేందుకు ముందుకు వస్తోంది.  పేద విద్యార్థినికి రూ.60 వేల విలువ  చేసే అదునాతన ల్యాప్‌టాప్‌ను తన ఫౌండేషన్‌ ట్రస్ట్‌ పురుషోత్తం చౌదరి, తానా అగ్రికల్చరల్‌ ఫోరం కో చైర్మన్‌ ఎద్దులపల్లి రఘు, బాలాజీ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం. సుబ్బారావు చేతుల మీదుగా అందజేశారు.  ఈ నెల 2న కల్యాణదుర్గంలోని ఎద్దులపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. ఈ ప్లాంట్‌ను ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌,  ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచ్‌, తానా  ప్రెసిడెంట్‌ అంజయ్య చౌదరి ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం 330 మందికి వాటర్‌ క్యాన్స్‌, కళాకారుల గుర్తింపు, వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో పేద విద్యార్థులకు చేయూత, సామాజిక సేవా స్ఫూర్తితో ఈ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు  అన్నారు.

Social Share Spread Message

Latest News