న్యూయార్క్ నగరంలో భారతీయులు నివసిస్తుండటం నగర ప్రజల అదృష్టమని అమెరికా సెనేటర్ చక్ షూమర్ తాజాగా వ్యాఖ్యానించారు. విభిన్నమైన, చైతన్యవంతమైన భారతీయులతో నగర సంస్కృతి మరింత సుసంపన్న మైందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌లోని ప్రతి ప్రాంతం, మతానికి చెందిన వారు నగరంలో ఉన్నారన్నారు. నగర ఆర్థిక రంగం, ఎంటర్‌టైన్మెంట్, రాజకీయాలు తదితర విభిన్న పార్శాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని ఆయన తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-212.jpg)
గత ఏడాది అమెరికాలో పర్యటించిన అతిపెద్ద అమెరికా సెనేట్ డెలిగేషన్‌కు నేతృత్వం వహించే అద్భుత అవకాశం తనకు దక్కిందన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి తాను శుభాకాంక్షలు తెలిపానన్నారు. అమెరికా-భారత్ బంధం పట్ల తనకున్న నిబద్ధతకు గుర్తుగా తన తొలి ప్రభుత్వ పర్యటనకు భారత్‌కు వెళ్లానని వివరించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-213.jpg)
తాజాగా తాను ప్రధాని మోదీతో గంటన్నరకు పైగా సమావేశమయ్యామని, ఈ సందర్భంగా భారత్ గొప్పదనం గురించి మోదీ ద్వారా ఎంతో తెలుసుకున్నామని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత్ అమెరికాల దౌత్యబంధం ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-213.jpg)