Namaste NRI

ఈ సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాం    

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా కీర్తిశ్వరన్‌ దర్శకత్వంలో వారు నిర్మించిన డ్యూడ్‌ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ పాత్రికేయులతో ముచ్చటించారు. డ్యూడ్‌  ఓ విభిన్న ప్రేమకథా చిత్రం. ఇందులో కొన్ని బ్యూటీఫుల్‌ మూమెంట్స్‌ ఉంటాయి. అవి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కూడా బాగా నచ్చుతాయి. ఈ సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నాం  అన్నారు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉందని చెప్పారు.

ప్రదీప్‌ రంగనాథన్‌ గత చిత్రం డ్రాగన్‌  తమిళంలో 31కోట్ల షేర్‌ చేసింది. దాంతో డ్యూడ్‌ కు తమిళంలో థియేట్రికల్‌ బిజినెస్‌ ఎక్కువగా జరిగింది. తమిళంలో మేము సొంతంగా రిలీజ్‌ చేస్తున్నాం అన్నారు. తమ సంస్థలో కథల ఎంపిక గురించి చెబుతూ  స్టోరీ సెలక్షన్‌ కోసం మా సంస్థ వద్ద మంచి టీమ్‌ ఉంది. వాళ్లు కథ విని బాగుందనిపిస్తే మా దగ్గరకు తీసుకొస్తారు. మేమంతా డిస్కస్‌ చేసుకొని ఫైనల్‌ చేస్తాం  అని అన్నారు.  డ్యూడ్‌  సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతుందని తెలిపారు.

Social Share Spread Message

Latest News