ప్రవాస భారతీయుల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. 1951లో జాతిపిత మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన రోజు జనవరి 9న ఏటా ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకొంటున్నాం. మన ప్రవాసులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. అదే సమయంలో వారు తమ మూలాలను మరువలేదు. వారి విజయాల పట్ల మేం గర్విస్తున్నాం అని మోదీ ట్వీట్ చేశారు.