Namaste NRI

దానికి మేం సిద్ధంగా ఉన్నాం :డొనాల్డ్‌ ట్రంప్‌

అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాలూ పోటాపోటీగా ఒకరిపై ఒకరు సుంకాలు విధించుకుంటున్నాయి. డ్రాగన్‌పై ట్రంప్‌ 125 శాతం ప్రతీకార సుంకాలు విధించగా,  ప్రతిగా అగ్రరాజ్యంపై చైనా 84 శాతం టారిఫ్‌లు విధించింది. ఈ టారిఫ్‌ వార్‌ వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పై అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. జిన్‌పింగ్‌ చాలా స్మార్ట్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

జిన్‌పింగ్‌ చాలా స్మార్ట్‌. తెలివైన వ్యక్తి. ఎప్పుడు ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. దేశం అంటే ఆయనకు అమితమైన ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. సుంకాలపై వాళ్లు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు జిన్‌పింగ్‌ నుంచి మాకు ఫోన్ కాల్‌ వస్తుందని భావిస్తున్నా. దానికి మేం సిద్ధంగా ఉన్నాం  అని ట్రంప్‌ పేర్కొన్నారు. చైనాపై అధిక టారిఫ్‌లు విధించి మరీ ఆ దేశాధ్యక్షుడిపై ట్రంప్‌ ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది.

Social Share Spread Message

Latest News