Skip to main content

Namaste NRI

అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెనక్కి తగ్గారు. తమ దేశంతో కలిసి పనిచేయాలని, తమకు సహకరించాలని అమెరికాకు పిలుపునిచ్చారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి తీసుకెళ్లిన సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, ఇప్పుడు అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం.

అంతర్జాతీయ చట్టాల పరిధిలో, పరస్పర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామని రోడ్రిగ్జ్ ప్రకటించారు. దీర్ఘకాలిక సంబంధాన్ని బలోపేతం చేసే ఎజెండాతో తన ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అయితే మదురోను అమెరికా బలగాలు పట్టుకెళ్లినప్పుడు మాత్రం ఆ చర్యను రోడ్రిగ్జో తీవ్రంగా వ్యతిరేకించారు. మదురోను వెంటనే వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశానికి ఒకరే అధ్యక్షులుగా ఉన్నారు, ఆయనే మదురో అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News