Namaste NRI

ఆ విషయంలో మేము సక్సెస్‌ : నాగవంశీ

నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, విష్ణు  ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మ్యాడ్‌ స్కేర్‌.  ఈ చిత్రానికి కల్యాణ్‌శంకర్‌ దర్శకత్వం వహించారు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ మ్యాడ్‌స్కేర్‌ చిత్రానికి ఉభయ తెలుగు రాష్ర్టాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది. అన్ని కేంద్రాల్లో షోలు హౌజ్‌ఫుల్‌ అవుతున్నాయి. నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమా తీశాం. ఆ విషయంలో మేము సక్సెస్‌ అయ్యామని భావిస్తున్నాం అన్నారు.

కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ కూడా సినిమాను ఆదరిస్తున్నారని నిర్మాత హారిక సూర్యదేవర ఆనందం వ్యక్తం చేశారు. మ్యాడ్‌కు సీక్వెల్‌ కాబట్టి తొలిభాగంతో పోల్చుకుంటారనే టెన్షన్‌తో థియేటర్‌కు వెళ్లామని, ప్రేక్షకుల రెస్పాన్స్‌ చూశాక సినిమా విషయంలో తమ అంచనాలన్నీ నిజమయ్యాయనే భావన కలిగిందని దర్శకుడు కల్యాణ్‌శంకర్‌ అన్నారు. థియేటర్లలో ప్రేక్షకుల ఎంజాయ్‌మెంట్‌ చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగిందని చిత్ర హీరోలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events