Namaste NRI

ఆ ఒప్పందాన్ని మేమే అతిక్రమించాం… అది మా తప్పే

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కుదిరిన 1999 లాహోర్‌ ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించిందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అంగీకరించారు. నాటి భారత ప్రధాని వాజ్‌పేయి, తాను ఆ ఒప్పందంపై సంతకాలు చేశామని, అయితే ఆ ఒప్పందాన్ని అప్పటి అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ఉద్దేశపూర్వకంగా అతిక్రమించారని ఆరోపించారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1998, మే 28న పాకిస్థాన్‌ ఐదు అణు పరీక్షలు నిర్వహిం చింది. దాంతో వాజ్‌పేయి మా దేశానికి వచ్చి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ఒప్పందాన్ని మేమే అతిక్రమించాం. అది మా తప్పే అని ఆయన ఒప్పుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress