Skip to main content

Namaste NRI

పరస్పర అంగీకారంతోనే విడిపోయాం.. ప్రైవసీ కావాలి

నటుడు  నాగబాబు కుమార్తె నటి, నిర్మాత నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డతో తన వివాహా బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు పొందిన ఈ జంట గత కొంతకాలంగా విడి విడిగా వుంటున్నారు. అయితే విడాకులపై తొలిసారిగా నిహారిక కొణిదెల స్పందించారు. నేను చైతన్య పరస్పర అంగీకారంతోనే వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితుల్లో నా వెన్నంటి ఉండి, నాకు ఎంతో సపోర్ట్‌ ఇచ్చిన నా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, స్నేహితులకు ధన్యవాదాలు. ఈ పరిణామాల తరువాత మా జీవితాల్లో మేం ముందుకు వెళ్లడానికి మాకు కొంత ప్రైవసీ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాం. నన్ను అర్థం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు నిహారిక.

Social Share Spread Message

Latest News