శ్రీలంకలో నిరసనకారులు ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స తన భార్య సహా మాల్దీవులకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఐతే అక్కడ కూడా గోటబయకి ఆందోళనకారుల నిరసన సెగ వదలకపోవడంతో ఆయన సింగపూర్ పయనమయ్యారని, అక్కడి ప్రభుత్వం ఆశ్రయం ఇస్తోందంటూ తెలిసింది. ఈ విషయమై సింగపూర్ ప్రభుత్వం స్పందించింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స వ్యక్తిగత పర్యటన నిమిత్తం సింగపూర్ వచ్చేరే తప్ప తాము ఆయనకు ఆశ్రయం ఇవ్వలేదని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. అయినా సింగపూర్ సాధరణంగా ఆశ్రయం కోసం అభ్యర్థనలను మంజూరు చేయదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయన ఆశ్రయం కోరలేదని కూడా పేర్కొంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)