Namaste NRI

హాలీవుడ్‌ స్థాయిలో ఈ సినిమాను చిత్రీకరించాం : విక్రమ్‌

తమిళ హీరో విక్రమ్‌ నటించిన కొత్త సినిమా కోబ్రా. శ్రీనిధి శెట్టి నాయికగా నటిస్తున్నది. తాజాగా చిత్ర ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సంద్భంగా విక్రమ్‌ మాట్లాడుతూ నా మనుసుకు నచ్చిన కథ ఇది. చిత్రీకరణలో ఎక్కడా రాజీపడలేదు. రష్యాలో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్‌ చేశాం. ఒక్కో పాత్ర మేకప్‌ ఐదు గంటల సమయం పట్టేది. తొమ్మిది విభిన్నమైన గెటప్పుల్లో నటించడాన్ని ఆస్వాదించాను. ప్రతి పాత్రకు బాడీ లాంగ్వేజ్‌, మేనరిజం ఉంటాయి. హాలీవుడ్‌ స్థాయిలో చిత్రీకరించాం. యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌ డ్రామా, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ ఉంటాయి.  ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిని అదించే సినిమా అవుతుంది అన్నారు.  నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ కమల్‌ హాసన్‌ తర్వాత నటుడిగా అంత విభిన్నమైన చిత్రాలు చేస్తారు విక్రమ్‌. ఇందులో ఆ  విలక్షణత చూస్తారు. భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు అబ్బురపరుస్తాయి అన్నారు. భారత్‌ మాజీ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకుడు ఆర్‌.అజయ్‌ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఎస్‌.ఎస్‌. లలిత్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎన్వీఆర్‌ సినిమా పతాకంపై ఎన్వీఆర్‌ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతున్నది.     

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events